01-02-2026 12:38:39 AM
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి) : తెలంగాణలో కౌలు రైతు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని రైతు కమిషన్ చైర్మన్ కోదంరెడ్డి అభిప్రాయపడ్డా రు. కేరళ రాష్ట్రంలో కుటుంబ స్త్రీ ప్రాజెక్టు పేరుతో కౌలు విధానం అమలవుతోందని, తెలంగాణలో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేసి అమలుచేయాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న కౌలు రైతు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపా రు.
రైతు కమిషన్ కార్యాలయంలో కో దండరెడ్డి అధ్యక్షతన కమిషన్ సభ్యులతో శనివా రం సమావేశం నిర్వహించారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో స్టడీ టూర్, రైతుల కో సం ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసు కొచ్చిన కౌలు చట్టంపైనా చర్చించారు. రైతు లు సంఘటితమైతేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందమన్నారు. రైతు కమిషన్ సభ్యులు రాములునాయక్, కేవీఎన్ రెడ్డి, భవానీరెడ్డి, భూమి సునీల్ పాల్గొన్నారు.