06-12-2025 12:00:00 AM
---జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు,డిసెంబర్5(విజయక్రాంతి): ములుగు జిల్లా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద పంచాయతీ ఎన్ని కల ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ము గిసే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని అన్నారు.
ఎన్నికల కమీషన్ సూచనల మేరకు ఎన్నికల విధులు నిర్వహించే ఓటర్లకు, అత్యవసర సేవలలో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, దీనికోసం పోస్టల్ ఓటింగ్ కేంద్రం/ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం సంబంధిత మండలాల ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే ఎస్.ఎస్. తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట మండలాల లో డిసెంబర్ 7న, రెండవ విడత ఎన్నికలు జరిగే మల్లంపల్లి, ములుగు,వెంకటాపూర్ మండలాలలో డిసెంబర్ 12న, మూడవ విడత ఎన్నికలు జరిగే వెంకటాపురం, వాజేడు,కన్నాయిగూడెం మండలాలలో డిసెంబర్ 15న సంబంధిత మండల ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. .