3 September, 2026 | 12:29 AM

ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

31-07-2025 | 11:41pm

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి

హుజూర్ నగర్: ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఒకట వార్డు దద్దనాల చెరువు కాలనీలో పౌరహక్కుల దినోత్సవాన్ని పోలీస్,మున్సిపల్ అధికారులతో కలసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... చట్టాలను పూర్తిస్థాయిలో తెలుసుకోవటం ప్రతి పౌరుడు తన బాధ్యత అన్నారు. సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించవద్దని ప్రజలకు వివరించారు.