calender_icon.png 2 August, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి

01-08-2025 12:00:00 AM

కొత్తపల్లి, జులై 31(విజయక్రాంతి): ఏఐఎస్‌ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం రోజున హలో విద్యార్థి చలో కలెక్టరేట్  కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు  కసిరెడ్డి మణికంఠ రెడ్డి మా ట్లాడుతూ గత నాలుగేళ్లగా ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేద ని, ప్రభుత్వం మారిన పాలన మాత్రం అలానే ఉందని, విద్యార్థుల పట్ల వివక్ష చూపిన ప్రభుత్వా లు మనుగడ సాధించలేదని అయన పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీజు రీయింబర్స్మెం ట్, స్కాలర్షిప్స్ నాన్ ప్రొఫెషనల్ 2000 కోట్లు, ప్రొఫెషనల్ 4000 కోట్లు గాను పెండింగ్ ఉపకార వేతనాలు ఉన్నాయని,2021 -22 ప్రభుత్వం విడుదల చేసిన బకాయులు 30%,2022 -23 గాను 20%,2023 -24,2024- 25,2025- 26మొత్తం. బకాయిలు ఉండడంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పలుమార్లు నిర్వదిక బంద్ నిర్వహించిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనలేదని,ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తుందన్నారు.

చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్డెక్కి ఉద్యమించే పరిస్థితి తెలంగాణలో వచ్చిందని, రాష్ట్రంలో విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి కేటాయించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆర్టీసీ లో ప్రతి విద్యార్థి ఉచితంగా రవాణా కల్పించాలని ప్రతి విద్యార్థికి ఉచిత బస్సు పాసులు ఇవ్వాలని , శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని దీని ద్వారా ఉన్నత విద్య విద్యార్థులకు మరింత అందుబాటులో వస్తే యూనివర్సిటీ అభివృద్ధి జరుగుతుందని కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం మూలంగానే శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కావడం లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రామారావు వెంకటేష్, మచ్చ రమేష్ జిల్లా ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్, కేశ బోయిన రాము యాదవ్, కనకం సాగర్, లద్దునూరి విష్ణు, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోల్లి సాయి కృష్ణ, బోయిన విష్ణు, శ్రావణ్, అశోక్ మరియు అజయ్‌పాల్గొన్నారు.