calender_icon.png 22 October, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాటరాయుళ్ల అరెస్టు

21-10-2025 06:29:55 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల, సంతాయిపేట గ్రామాలలో పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్లను సోమవారం పట్టుకుని అరెస్టు చేసినట్లు తాడువాయి ఎస్సై నరేష్ తెలిపారు. చిట్యాలలో ఐదుగురు, సంతాయిపేటలో నలుగురు పేకాట ఆడుతుండగా పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద చిట్యాలలో నుంచి రూ. 17800 నగదు, సంతాయిపేటలో రూ. 1110 నగదు, ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లయితే సమాచారం అందించాలని ఎస్సై కోరారు.