17-11-2025 06:51:34 PM
రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు న్యాయవాది సునీల్..
తుంగతుర్తి (విజయక్రాంతి): ప్రతి రైతు కనీసం రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే బూమి సమస్యలు పరిష్కారం కాజాలుతాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు న్యాయవాది సునీల్ పేర్కొన్నారు. మొదటిసారిగా సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి జాజిరెడ్డిగూడెం నాగారం మండలాల్లో మొదట ఐకెపి కేంద్రాలను సందర్శించి రైతులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన తాసిల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుకు 175 చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినట్లు, వీటిపై ఏ ఒక్క రైతుకు అవగాహన లేకపోవడం వలన ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 20 లక్షలకు పైగా భూ సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు.
గతంలో ధరణిలో పూర్తిస్థాయిలో హక్కులు కల్పించలేదని అన్నారు. నేడు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతుల ప్రయోజనాలు రైతుల హక్కుల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం సాదా బైనమా పై అధికారులు సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. సాగు చేసే ప్రతి రైతుకు భూమిపైన విత్తనం సాగునీరు పంట రుణాలు, పంటల బీమా మార్కెట్లలో కొనుగోలు సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి అవగాహన కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
ప్రస్తుతం తుఫాన్ తాపిడికి లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారని, రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానందం ఏ డి ఏ రమేష్ బాబు ఆదర్శ రైతుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు కసరబోయిన లింగ యాదవ్ మండల అధ్యక్షులు భువనగిరి శ్వేత ఉపాధ్యక్షులు కొండా సుధాకర్, ఉట్కూరి ప్రసాద్, ఇరుగు సైదులు, పులుసు శేఖరు, గడ్డం శివ, ఎస్కే అమీదు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.