calender_icon.png 24 October, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సమ్మెకు బీసి సంఘాల మద్దతు

24-10-2025 04:54:41 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని, జరిగిన చర్చల్లో దసరా పండుగ లోపు రూ. 600 కోట్లు, దీపావళి పండుగ లోపు మిగతా 600 కోట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చారు. కానీ మొత్తం ఇప్పటి వరకు 1200 కోట్ల కు గాను కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం విడుదల చేయలేదు కాబట్టి ప్రైవేటు కాలేజీల యాజమాన్యంలు నవంబర్ 3 నుంచి నిర్వదిక సమ్మె చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సంఘాలు సమాఖ్య ప్రకటించింది.

దీనికి సంబంధించి బీసీ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని మద్దతు తెలుపుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతామని బీసీ సంఘాల తరుపున హామీ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన 300 కోట్లు వాటిలో సగానికి పైగా ప్రభుత్వం విద్యాసంస్థలకే  విడుదల చేశారు. కావున వెంటనే 900 కోట్లు విడుదల చేసి ప్రైవేటు కాలేజీల యాజమాన్యంలను, విద్యార్థులను ఆడుకోవాలని, ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాం.

నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వలన అనేక కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా మంది కాలేజీలు మూసి వేయడం జరిగింది. విద్యార్థుల సర్టిఫికెట్ కోసం చాలా ఇబ్బందులు పడి మద్యలోనే చదువు ఆపివేసినారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి ప్రైవేటు విద్యా సంస్థలను మరియు విద్యార్థులను ఆడుకోవాలని బీసీ సంఘాల తరుపున ఎన్నం ప్రకాష్ ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నామని అన్నారు.