27-11-2025 12:00:00 AM
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
తాండూరు, నవంబర్ 26, (విజయ క్రాంతి ): ప్రపంచంలోనే లిఖిత పూర్వక అతి పెద్ద రాజ్యాంగం మన రాజ్యాంగ మని వికారాబాద్ జిల్లా యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి అన్నారు . నేడు భారత రాజ్యాంగ దినోత్సవం పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..మన రాజ్యాంగానికి ప్రత్యేకమైన స్థాయికి తీసుకొని పోవడానికి దేశంలోని 140 కోట్ల మంది పాత్ర ఉందని అన్నారు.
ప్రపంచ జనాభాలో ఒకటి బై ఐదవవంతు ఒకే తాటిపై ఉండడానికి కారణం రాజ్యాంగమని అన్నారు. పాఠశాలలో నెల రోజులలో ప్రార్థన సమయంలో రాజ్యాంగంలోని పొందుపరచ బడిన ముఖ్యమైన అంశాలను ఉపాధ్యాయులు ప్రతిరోజు ప్రార్థనలో వివరించడం జరుగుతుందని . దీంతో విద్యార్థి దశ నుండే రాజ్యాంగంపై శ్రద్ధ, భక్తి ఏర్పడుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం విశిష్టతపై వ్యాసరచన పోటీలు
ఘట్‌కేసర్, నవంబర్ 26 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా.. పోచారం మున్సిపల్ ప్రతాపసింగారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6,7 తరగతులు చదువుతున్న జూనియర్స్ విద్యార్థులు, 8,9,10 చదువుతున్న సీనియర్ విద్యార్థులకు బుధవారం భారత రాజ్యాంగం దాని విశిష్టతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కుమా ర్ తో కలసి అంబేద్కర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య మాట్లాడుతూ విద్యార్థులు భారత రాజ్యాంగం పై అవగాహన ఉన్నప్పుడే శాస్త్రీయ ఆలోచన పెంపొందించుకోడానికి దోహద పడుతుందన్నారు. ప్రధానోపాధ్యాయుడు రవి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే విధంగా ఉపాధ్యాయ బృం దం కృషి చేస్తుందని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రజల చేతిలో ఆయుధం భారత రాజ్యాంగం...
కీసర, నవంబర్ 26 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి కీసర మండల ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కీసర మండల ప్రధాన చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కీసర మండల అంబేడ్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ పూలమాల వేసి, రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మూల స్తంభం అని, ఇది ప్రజల చేతిలో ఉన్న ఒక బలమైన ఆయుధం వంటిదని అభివర్ణించారు. కీసర మండలం సంయుక్త కార్యదర్శి కట్ట శంకరయ్య, సీనియర్ నాయకులు పండుగ రాజలింగం ముదిరాజ్, ఆనబోయిన కృష్ణ ముదిరాజ్, ఊట్ల ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొని, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 26: రాజ్యాంగంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సురక్ష సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ అన్నారు. నవంబర్ 26 భారత రాజ్యాంగం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రకటన విడుదల చేశారు. అనంతరం గోపీ శంకర్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరూ సమ న్యాయం, సమపాలన, సమానత్వం లభిస్తుందని..
ఈ రోజే జాతీయ న్యాయ దినోత్సవాన్ని కూడా జరుపుకుంటా మన్నారు. ఆంగ్లేయుల పరిపాలన అనంతరం మనకంటూ ఒక ప్రత్యేక విధి విధానాలు ఉండాలని.. దీనికి నిర్దిష్టమైన రాజ్యాంగం అవసరమని మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సారధ్యంలోనే రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు.
ఈ రాజ్యాంగాన్ని పరిషత్‌లో అనేక మంది మేథావులను సభ్యులుగా చేర్చి నవంబర్ 26, 1949లో ఆమోదం పొందడంతో దేశమంతటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుం టున్నామని వివరించారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని.. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. రాజ్యాంగంపై ప్రజల్లో విస్తృతమైన అవగా హన కల్పించి..వారిలో చైతన్యం నింపాలన్నారు.
ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో..
మేడ్చల్ అర్బన్, నవంబర్ 26 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో ఐ ఎన్ టి యు సి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. రాజ్యాంగం ప్రాముఖ్యత గురించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో రాజు, రాజేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.