27-11-2025 12:00:00 AM
నేటి నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియ
కరీంనగర్, నవబరు 26 (విజయ క్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో తమ తమ పార్టీ లు బలపరిచే అభ్యర్థులను గెలిపించుకోవ డం కోసం నాయకులు నజరానాలు ప్రకటిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్ర క్రియ నేటి నుండి(గురువారం) ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ నజరానాల అం శం చర్చనీయాంశమయింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెం ట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఇప్పటికే 10 లక్షల రూపాయల నజరానాను ప్రక టించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ 20 లక్షల రూపాయల నజరానాను ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీ ల అభివృద్ధికి 20 లక్షల రూపాయలు ప్రో త్సాహకాన్ని అందిస్తామని తిమ్మాపూర్ లో ని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన స మావేశంలో ప్రకటించారు.
సర్పంచ్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకుండా మన వా రిని గెలిపించుకోవాలని పేర్కొంటూ, మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరప ట్నం, మానకొండూర్, తిమ్మాపూర్, బెజ్జంకి, ఇల్లందకుంట, గన్నేరువరం మండలాల్లో రెండు విడతలుగా జరగనున్న ఎన్నికలపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. వీరిద్దరి బాటలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మరికొందరు నేతలు నజరానాలు ప్రకటించే అవకాశం ఉంది.
బకాయిల సంగతి...
గత ప్రభుత్వంలో మాజీ సర్పంచులకు వివిధ పనులకు సంబంధించి లక్షలాది రూపాయలు బకాయిల కింద రావాల్సి ఉంది. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హామీ ఇవ్వడంతో గ్రేవీయార్డుల నుండి మొ దలు గ్రామ పంచాయతీ భవనాలు, ట్రాక్టర్ల కొనుగోలు వరకు ఆయా గ్రామాల సర్పంచులు అప్పునప్పు చేసి పనులు చేయించారు. అయితే అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటికీ చెల్లింపులు జరగలేదు.
ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరంతా అనాసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే తాము పోటీ చేస్తామని అంటున్నారు. అయితే వీరికి ఇప్పటి వరకు హామీలు ఇచ్చారు కానీ నిధుల విడుదలపై ఏ నాయకుడు శ్రద్ధ చూపడం లేదు. గతంలో ఎదురై న పరిస్థితుల దృష్ట్యా ఈ సారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకాముందు ఆలోచిస్తున్నారు.
శివారు గ్రామాల్లో పోటీ ఉండే అవకాశం...
కరీంనగర్ నగరంతోపాటు జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్ల, మెట్ పల్లి, రామగుండం, మంథని, హుజూరాబాద్, జమ్మికుంట, పెద్దపల్లి పట్టణాలకు ఆనుకొని ఉన్న గ్రామాల నుంచి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. నగరానికి, పట్టణాలకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో భూముల రేట్లు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఇక్కడ నుంచి పోటీ చేసేవారికి ఖర్చు కూడా పెద్ద మొత్తంలో అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తమ తమ వారిని గెలిపించుకునేందుకురంగంలోదిగాయి.