calender_icon.png 7 January, 2026 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ శ్రీరాముని నామస్మరణం చేయాలి

06-01-2026 01:16:57 AM

శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ దుబ్బాక

బాన్సువాడ,జనవరి 5 (విజయ క్రాంతి): ప్రతి ఒక్కరు శ్రీరాముని నామస్మరణం చేయాలని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవాలని అప్పుడే శ్రీరామరాజ్యం ఏర్పడుతుందని శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ దుబ్బాక పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామ శివారులోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్  ఆధ్వర్యంలో బోర్లం గ్రామానికి చెందిన పర్వా రెడ్డి  ఏర్పాటు చేసిన శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమానికి సమర్థ మహారాజ్ హాజరయ్యారు.

ఆదివారం రాత్రి బోర్లమ్ గ్రామానికి విచ్చేసిన శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ను గ్రామంలోని దత్తాత్రేయ ఆలయం నుండి గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో మంగళహారతులతో మహిళలు ఘన స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, సరస్వతి ఆలయ ధర్మకర్త శంభు రెడ్డిలు హాజరై స్వామివారికి ఘన సన్మానం చేశారు.  శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కు పర్వారెడ్డి దంపతులు గ్రామ పెద్దలు ఘనంగా సత్కరించారు. 

 పోచారం భాస్కర్ రెడ్డి త్వరలో ఏర్పాటు చేసే 108 అడుగుల భారీ ఆంజనేయ స్వామి విగ్రహ భూమి పూజకు తాను వచ్చి ప్రత్యేక పూజలు చేస్తానన్నారు. పోచారం భాస్కర్ రెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.  గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి మంద శ్రీనివాస్ మన్నె రమేష్ మన్నే చిన్న సాయిలు భూషణ్ విద్యాసాగర్ రెడ్డి మోహన్ రెడ్డి గోపానపల్లి సాయిలు జలీల్ కాశీరామ్ గంగారం సాయిలు భాను రాజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.