06-01-2026 01:17:05 AM
సిద్ధార్థ కాలేజీలో నిర్వహణ
హైదరాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ లో ఎంబీఏ గ్రాడ్యుయేషన్ వేడుకలు ఘనం గా నిర్వహించారు. కళాశాల చైర్మన్ డా జి. నాగయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ర్ట ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లిబాద్రి హాజరై మాట్లాడుతూ.. మేనేజ్‌మెంట్ విద్యార్థులు నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు అలవరచుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకుసాగాలని సూచించారు.
గౌరవ అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ ఆర్ నాగేశ్వర్ రావు పాల్గొని విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా ఎం కవిత మాట్లాడుతూ.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్య అందించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో విజయా పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కె ప్రతాప్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో ఎంబీఏ పూర్తిచేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు అందజేశారు.