calender_icon.png 16 September, 2025 | 4:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి

06-11-2024 05:20:03 PM

కాప్రా (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని సైనిక్ పూరిలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమగ్ర కుటుంబ సర్వేను సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జగన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి ఒక్కరు బాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల వంటి అంశాలను సర్వేలో పేర్కొనలని ఆయన సూచించారు. అనంతరం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసి ఎన్యుమరేటర్లకు ఇంటింటి కుటుంబ సర్వే కిట్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ వివిధ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.