01-12-2025 12:20:16 AM
నారికేళ స్వామి చెన్నారెడ్డినీ సన్మానించిన మాజీ వైస్ చైర్మన్ వాకిటి.శ్రీధర్
పెద్దమందడి, నవంబర్ 30 : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దోడగుంటపల్లి గ్రామానికి చెందిన నారికేళ స్వామి చెన్నారెడ్డి పడిపూజ ఘనంగా నిర్వహించారు.ఇట్టి పడిపూజ కార్యక్రమములో మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని చెన్నారెడ్డి స్వామిని సన్మానించారు.ఇట్టి పూజ కార్యక్రమం గురుస్వాములు గోవిందరెడ్డి,ముత్తు కృష్ణ కరకమలములచే అత్యంత దేదీప్యమానంగాజరిగింది.గణపతిహోమం,పల్లకిసేవ,కుంకుమార్చన అభిషేకం అష్టోత్తరం మహపడిపూజ జరిగాయి.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 18సార్లు మాలవేసుకొని శబరిమల యాత్ర చేయడం పూర్వజన్మసుకృతమని అన్నారు.అయ్యప్ప దీక్షలతో మానసిక ప్రశాంతత,ప్రజలలో భక్తిప్రభత్తులు, ఐకమత్యం పెంపొందుతాయి అని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గురుస్వాములు రఘుమారెడ్డి కృష్ణసాగర్ నరేందర్ అశోక్ రెడ్డి గట్టు శశి పాపిరెడ్డి అనిల్ రాకాసి శ్రీనివాస్ రెడ్డి మేఘాశ్యం రెడ్డి రామకృష్ణ గ్రామస్థులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.