14-12-2025 12:05:02 AM
తూప్రాన్, డిసెంబర్ 13: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామ పం చాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బేడ బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందిన భీములును.. బిచ్చగాళ్లు సర్పంచ్‌గా పో టీ చేస్తారా? చేస్తే బిచ్చగాళ్లకు ఓటు వేస్తారా? అని మాజీ సర్పంచ్ భర్త జంగం రమేష్ అవమానించాడని బాధిత వర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ, అవి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద డబ్బులు లేవని, కాయకష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటు న్నామని తెలిపారు. అయితే ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యావత్ తెలంగాణ రాష్ట్ర బేడ బుడగ జంగాల సంఘాలు.. జంగం రమేష్‌పై సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.