15-12-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): దేవాలయముల నిజ అర్ధాన్ని తెలిపే త్రైత సిద్ధాంత గ్రంథాల గురించి ప్రతి ఒక్కరికి తెలివాల్సిందేనని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు సిహెచ్ గిరి తెలిపారు. త్రైత సిద్ధాంతం ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక హైదరాబాద్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా పరిధిలోని కొనయిపల్లి, లింగాపూర్, వీరారెడ్డి పల్లి, మైసిరెడ్డిపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పట్టణాలలో త్రైత సిద్ధాంత భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథముల ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు.
త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాల నుండి దేవాలయంలో నిజ అర్థం తెలియబడుతుందని ఏడు గోపురాలు, ఏడు ద్వారాలు, ధ్వజస్తంభం, గంట, ప్రదక్షిణలు మొదలగు వాటికి సంబంధించిన రహస్య జ్ఞానం తెలియజేయడం జరిగిందని గిరి వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథం శ్రీకృష్ణుడి అసలైన ధ్యానం ను తెలియజేస్తుందని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ కర్మయోగం విశిష్టత త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకోవాలని ముఖ్య ఉద్దేశంతో భగవద్గీత ప్రచారం చేస్తున్నామని అధ్యక్షులు సిహెచ్ గిరి వెల్లడించారు. హైదరాబాదు కమిటీ సభ్యులు ఎన్‌ఎస్ కుమార్. నరసింహ చారి. మధు. పవన్. ధన్వంతరి. సుధీర్.ప్రతాప్.రామకృష్ణ. సత్యనారాయణ. శ్రీనివాస్. ప్రదం. రఘువీర్. లక్ష్మి. చంద్రకళ. ప్రియా. భాను. అనురాధ. పద్మ. స్వప్న. సౌమ్య తదితరులు పాల్గొన్నారు.