19-12-2025 01:40:41 AM
‘ఫలితాలు తారుమారు చేశారాంటూ బీజేపీ సర్పంచ్ అభ్యర్థి ఆరోపణ
పోలింగ్ సిబ్బందితో ఘర్షణ
మద్దతుదారులతో కలిసి బ్యాలెట్ బాక్సులు బయటకు తరలించకుండా పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయింపు
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీచార్జ్.. గాల్లోకి కాల్పులు
ఆందోళనకారులపై కేసు నమోదు
వెల్గటూర్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మం డలం పైడిపల్లి గ్రామంలో ఎన్నికల వేళ బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ ఎస్ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించగా.. కొందరు పెద్దల జోక్యంతో చివరి నిమిషంలో సర్పంచ్ ఫలితాన్ని తారుమారు చేశారని బీజేపీ మద్దతు రాలు ఆరోపిస్తూ గ్రామస్థులు, యువతతో కలిసి పోలింగ్ సిబ్బందితో ఘర్షణకు దిగా రు. బ్యాలెట్ బాక్స్‌లు బయటకు రాకుండా పోలింగ్ కేంద్రం ముందు వందలాది మంది బైఠాయించి నిరసనకు దిగారు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టేందుకు తీవ్రం గా ప్రయత్నించినా శాంతించకుండా రీ కౌం టింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటం తో చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేసి, గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు. పైడిపల్లిలో 2,050 ఓటర్లు ఉండగా నలుగురు అభ్యర్థులు సర్పంచ్ బరి లో నిలిచారు. బీఆర్‌ఎస్ మద్దతుతో గంగుల పద్మనగేష్, బీజేపీ నుంచి జక్కుల మమత బరిలోకి దిగారు.
ఓటింగ్ సజావుగా సాగినప్పటికీ ఓట్ల లెక్కింపు సమయంలో ఒక్కసా రిగా ఊహించని పరిణామం చోటుచేసుకుం ది. నలుగురిలో బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఓ రాజకీయ ప్రముఖనేత కౌం టింగ్ హాల్‌లోకి ప్రవేశించాడు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయ్యిన ట్లు అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నా రు. చివరి నిమిషంలో కొందరు కీలక వ్యక్తు ల జోక్యంతో సర్పంచ్ ఎన్నిక ఫలితాన్ని మార్చారని ఆరోపిస్తూ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా గ్రామస్థులు, యువత పోలింగ్ సిబ్బం దితో ఘర్షణకు దిగారు.
బ్యాలెట్ బాక్సులను బయటకు తరలించకుండా పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించారు. పరిస్థితి చేజారిపోతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు రీకౌం టింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి, గాల్లోకి కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. దీనికి ప్రతిగా గ్రామస్థులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.
ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడ్డారు. అనంతరం పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని, బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రం నుంచి తరలించారు. ఎన్నికల రిటర్నిoగ్ అధికారి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఇద్దరు ఆందోళనకారులపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ పేర్కొన్నారు.
‘పైడిపల్లె’ సర్పంచ్ ఓట్లను రీ కౌంటింగ్ చేయాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాంచందర్‌రావు
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలోని వెల్గటూర్ మండలం పైడిపల్లె గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఓట్లను రీకౌంటింగ్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాంచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఓట్ల లెక్కింపుల్లో తప్పిదాలు, అక్రమాలు జరిగాయని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
బీజే పీ మద్దతుగా ఉన్న అభ్యర్థి జక్కుల మమత శేఖర్‌కు సంబంధించి ఒక బ్యా లెట్ లెక్కించకుండానే 17 ఓట్లతో ఓడిపోయినట్లు ప్రకటించారని తెలిపారు. రీ కౌంటింగ్ చేయాలని బీజేపీ కోరినా పట్టించుకోకపోవడమే కాకుండా పోలీసులు లాఠీచార్జీ చేశారని రాంచందర్‌రా వు పేర్కొన్నారు. ఈ గ్రామంలో బీఆర్‌ఎస్‌కు అధికార కాంగ్రెస్ మద్దతుగా నిలి చిందని, ఈ రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం బయటపడుతోందన్నారు.
ఫలితాలు తారుమారు చేశారు : సర్పంచ్ అభ్యర్థి జక్కుల మమత
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికారులు ఫలితాలు తారుమారు చేశారు. ఎన్నికల కౌంటింగ్ హాలులోకి అనధికారికంగా గ్రామానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నేత ప్రవేశించారు. దాంతో అధికారులు గెలవాల్సిన నన్ను ఓడిపోయినట్లు ప్రకటించారు. కౌంటింగ్ హాల్‌లో ఉన్న అధికారులు బెదిరించి, ఓడిపోయినట్లుగా నా నుంచి సంతకం తీసుకున్నారు. రీ కౌంటింగ్ చేయాలని అధికారులను ఎంత బతిమాలినా అధికారులు వినకుండా మహిళనని కూడా చూడకుండా బూతులు తిడుతూ కౌంటింగ్ హాలు నుంచి బయటకు పంపించా రు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి నాకు న్యాయం చేయాలి.