calender_icon.png 11 July, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

11-07-2025 12:35:17 AM

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కడ్తాల్, జూలై 10: సామాజిక సేవా కార్యక్రమంలో యువత భాగస్వామ్యం కావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు ఆధ్వర్యంలో కడ్తాల్ మండల కేంద్రంలో మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఆవరణలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ అత్యవసర సమయంలో దావాఖానలో వైద్య చికిత్సలు పొందుతున్న పలువురు రోగులకు సకాలంలో రక్తం అందుబాటులో లేక పలువురు మృతి చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆపద సమయంలో రక్తదానం చేసి మానవ దృక్పథంతో చికిత్స పొందుతున్న వారికి సాయం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. అమంగల్ బ్లాక్ మండలాల నుంచి పలువురు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన యువతను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో టి. పిసిసి సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ బర్త్డే పురస్కరించుకొని ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు.

కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బిచ్చ నాయక్, బిక్య నాయక్, గుడురు శ్రీనివాస్ రెడ్డి , చందోజీ , గంప శ్రీను, కర్ణాకర్ గౌడ్,జోహార్ లాల్ లు పాల్గొన్నారు.