11-07-2025 12:35:58 AM
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆదిలాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : జిల్లాలో ప్రభుత్వ భూములు, స్థలాలు ఆక్రమణ గురి కాకుండా తగు చర్యలు చేపట్టాల ని జిల్లా అధికారులను కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. మావల మండలంలోని భట్టిసావర్గం గ్రామంలో సర్వే నెంబర్ 72/8 భూములను జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.
అగ్రాజా టౌన్ షిప్ లోని రాజీవ్ స్వగృహ భూ సేకరణకు సంబంధించిన స్థలాన్ని సందర్శించి, క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేసి ఆర్డిఓ వినోద్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ సర్వే ఏడి, రాజీవ్ గృహ జనరల్ మేనేజర్, ఇతర సిబ్బందికి కలెక్టర్ తగు సూచనలు చేశారు.
ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయా భూముల పై ఎలాంటి ఆక్రమణలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమణదారుల నుండి కాపాడాలని సూచించారు.