22-10-2025 12:00:00 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, అక్టోబర్ 21 (విజయక్రాం తి) : ‘మీ స్వరం - మీ దార్శనికత - మా భవిష్యత్తు’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే’లో అందరు పాల్గొనాలని మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. ఈ నెల 25లోగా పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. సర్వేలో రాష్ట్ర ప్రజలు, ఎన్‌ఆర్‌ఐ లు, ప్రతి ఉద్యోగి ఈ సర్వేలో పాల్గొని తమ విలువైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఇందు కోసం www.telang ana.gov.in/telanganarising వెబ్ సైట్ లో సందర్శించాలన్నారు.