17-08-2024 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రభుతం తమ సమస్యలను పరి ష్కరించాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్ల టెక్స్‌టైల్స్ పార్క్ మరమగ్గాల కార్మికులు ఒక్కరోజు టెక్స్‌టైల్స్ పార్క్ బంద్ చేపట్టారు. టెక్స్‌టైల్స్ పార్క్ గేటు వద్ద సీఐటీయూ ఆధర్యంలో నిరసన దీక్ష నిరహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. టెక్స్‌టైల్స్ పార్కులో మూతపడ్డ పరిశ్రమలను వెంటనే తెరవాలని, పూర్తిస్థాయిలో పరిశ్రమలు ప్రారంభించి కార్మికులకు ఉపా ధి కల్పించాలని కోరారు. యారన్ సబ్సిడీ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేసి, సంవత్సరం పొడవునా ఉపాధి కల్పించాలని కోరారు. లేదంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.