calender_icon.png 6 October, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ గెలుపు లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలి

06-10-2025 01:33:03 AM

  1. కార్యకర్తలకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుంది 
  2. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్య  నాయక్

మరిపెడ/దంతాలపల్లి అక్టోబర్5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతంగా నిర్వహించుకోవడం  జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ  ఎమ్మెల్యే రెడ్య నాయక్ హాజ రై నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం   చేయడం జరిగింది.అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్య నాయక్ మాట్లాడుతూ అధికారంలో లేకున్నా  ప్రతి  గ్రామ గ్రామాన బిఆర్‌ఎస్ జెండా ఎగరాలని  మాజీ ఎమ్మెల్యే అన్నారు.

ఈ సమావేశం నిర్వహించుకున్నామని, బిఆర్‌ఎస్  కెసిఆర్ ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా నాయకులు పనిచేయాలని, ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో మెలగాలని పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిని పార్టీ నుండి  తొలగిస్తామన్నారు. ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి స్థానాల్లో నిలువబోయే నాయకులు సమన్వయతో పని చేసుకుని ఎవరికీ పార్టీ బీఫామ్ ఇచ్చిన కలిసికట్టుగా పని చేసి  బిఆర్‌ఎస్ పార్టీ గెలిచే విధంగా కష్టపడాలి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజల్లో వివరించి ఓటును అడగాలన్నారు. బిఆర్‌ఎస్ హయంలో ప్రజా సంక్షేమమే దేహంగా పనిచేశామన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ జెడ్పి వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర రెడ్డి,బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులునూకల గౌతంరెడ్డి,మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఓలాద్రి మల్లారెడ్డి,యూత్ అధ్యక్షులు వీరబోయిన కిషోర్, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ధర్మారపు వేణు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.