06-10-2025 12:00:00 AM
జిల్లా కమిటీలో సీనియర్లకు దక్కని పదవులు
నిన్న మొన్న వచ్చిన వారికి కీలక పదవులా అంటూ.. గుర్రుమంటున్న సీనియర్లు
నిర్మల్, అక్టోబర్ 5(విజయక్రాంతి): క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి బిజెపి నిర్మల్ జిల్లాలో దారి తప్పుతుందన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జిల్లా కమిటీలో సీనియర్లకు పదవులు దక్కకపోవడం ఇందుకు నిదర్శనమని పార్టీ సీనియర్ నేతలు ఆక్రో శం వెలగకుతున్నారు. నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే మూడు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో జిల్లా కమిటీ ప్రకటన కొత్త కాకలు రేకెత్తిస్తుంది.
జిల్లా అధ్యక్షు నిగా ఖానాపూర్ నియోజకవర్గం రితీష్ రాథోడ్ ఎన్నిక కాగా జిల్లా కమిటీని ఇన్నాళ్లుగా ప్రకటించకుండా మూడు వర్గాలు ప్రయత్నాలు సాగించాయి. తమ వర్గానికి ప్రాధాన్యత తగ్గించడంపై ఇప్పటికే కొం దరు నేతలు పార్టీ చీఫ్ రామచంద్ర రావు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
జిల్లా కమిటీ పేర్లు పరిశీలనలో తమ వర్గీయులను అధిష్టానానికి సూచించినప్పటికీ ఒకరిద్దరు మినహా మిగతా వారందరు కూడా జిల్లా కమిటీలో కొత్తవారు కావడం పాత సీనియర్లకు మింగుడు పడడం లేదు
మారుతున్న సమీకరణలు.
నిర్మల్ జిల్లాలో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జన తా పార్టీ అనూహ్యంగా పం చుకుంది. అప్పటి అధికార పార్టీ టిఆర్‌ఎస్ ప్రధాన ప్రత్యక్షమైన కాంగ్రెస్‌కు దీటుగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తన సత్తాను చాటుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలు చేరిన నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ముధో ల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ విజయం సాధించగా ఖానాపూర్‌లో ఆ పార్టీ అభ్యర్థి సల్ప తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసింది.
అప్పటివరకు జిల్లాలో భారతీయ జన తా పార్టీ కార్యక్రమాలను నిర్వహించిన సీనియర్ నాయకులైన అయ్యన్న గారి భూమ య్య రావుల రామనాథ్ అంజు కుమార్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి సట్ల ముదులు నియోజక వర్గంలో రవికుమార్ పాండే మోహన్‌రావు పట్టి పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యేలుగా రామారావు పటేల్ మహేశ్వర్ రెడ్డి గెలవడంతో బిజెపిలో నూతన ఉత్సవం కనిపించింది.
పార్టీ ముఖ్య నాయకులు కార్యక ర్తలు సమిష్టిగా పార్టీ కోసం కష్టపడి పని చేయాల్సిన తరుణంలో ఎమ్మెల్యేల తీరు నచ్చక సీనియర్ నేతలు వారి కార్యక్రమాల కు దూరంగా ఉంటూ వస్తున్నారు. సీనియర్లను కాదని జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం వారి అనుకూలస్తులకే పార్టీ పదవులు అప్పగించడం తో బిజెపిలో మూడు గ్రూపులుగా ఏర్పడ్డాయి. వీరి మధ్య ఐక్యత కుదిరించేందుకు పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టిన వివాదం సమస్య పోకపోగా మరింత జటిలమవుతుంది.
పార్టీ అధిష్టానం సీనియర్ నేతల మాటలకు గౌరవం ఇవ్వడం లేదని కొందరు ముఖ్య నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి విషయంలో రెండు వర్గాలు తమ వారిది ఆధిపత్యం ఉండేలా చివరి వరకు కొట్లాడిన సీనియర్ నేతలను కాదని ఖానాపూర్ కు చెందిన రితేష్ రాథోడ్ కు పార్టీ పగ్గాలను అప్పగించారు. అయితే ఆయన పాత కొత్త కలయిక ముఖ్య నేతలతో కలుపుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొందరు ముఖ్య నాయకులు ఆ కార్యక్రమాలకు దూరంగా ఉండడం పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
పదవుల విషయంలో ఎమ్మెల్యేలదే కీలకపాత్ర
నిర్మల్ జిల్లాలో జిల్లా కమిటీ ఏర్పాటుతోపాటు జిల్లా కమిటీలో కొందరికి పదవులు అప్పగించడంలో ఎమ్మెల్యేలు కీలకపాత్ర పోషించినట్టు జాబితాను బట్టి తెలుస్తుంది. జిల్లా కమిటీ జాబితాలో ఐదుగురు ఉపాధ్యక్షులు ముగ్గురు జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆరుగురు కార్యదర్శులు ఒక ట్రెజర్ సోషల్ మీడియా ఇంచార్జ్ ఐటీ సెల్ ఇంచార్జ్ పదవులను భర్తీ చేయగా నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి జిల్లా కమిటీలో పేర్లు రావడం పై సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్టీ కోసం ఎంతో క్రమశిక్షణగా పనిచేస్తున్న తమ సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకపోగా తమ కంటే జూనియర్లైన నాయకులను జిల్లా కమిటీలో ఎలా ఎంపిక చేస్తారని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. నిర్మల్ ముధోల్ ఖానాపూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీలో జూనియర్ సీనియర్ల మధ్య ఇప్పటికీ రాజకీయ వేడితిత్తులు నేపథ్యంలో జిల్లా కమిటీ లో పదవులు కేటాయించడంపై ఈ వివాదం మరింత ముదిరిందని తెలుస్తోంది జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్నప్పటికీ పార్టీలో అంతర్గత కలహాలు పార్టీ ముఖ్య నాయకులను కలవరానికి గురిచేస్తున్నాయి.
జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కరవడం పై పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే తమకు కనీసం జిల్లా కమిటీలో పేర్లు కూడా పరిశీలనలు లేవని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందరికీ అవకాశం వస్తుంది
నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు పార్టీ నాయకులందరినీ కలుపుకొని ముందు కు వెళ్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు పార్టీ కోసం కష్టపడి పనిచేసే ముఖ్య నాయకులకు జిల్లా కమిటీలో అవకాశం కల్పించాం.
జిల్లాలో సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలో తప్పకుండా అవకాశం వస్తుం ది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని నిర్మల్ జిల్లాలో సత్తా చాటుకు చెందినదిగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. . ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం.
రితీష్ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు