06-10-2025 12:00:00 AM
మున్సిపల్ రోడ్డు ఆక్రమణ
కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నిర్మాణం
మామూళ్ల మత్తులోఅధికారులు
భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్‌౫ (విజయక్రాంతి):మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నట్లా... మామూలు దండుకోవడమేనా అన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తు న్నాయి. అక్రమ నిర్మాణాలు, నిర్వహణ, ని బంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వ్యవహారాలను అరికట్టాల్సిన అధికారులు ఫిర్యాదులు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎక్కడో దూరంలో, కనిపించకుండా సందు ల్లో అక్రమాలు చోటు చేసుకున్నారు అంటే తెలియదేమో అనుకొని సరీ పెట్టుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ పాల్వంచ డివిజన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో అనుమతులు లేకుండా ఫంక్షన్ హాల్ నిర్వహణ చేస్తున్నా, ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డును సగానికి పైగా ఆక్రమించి నిర్మాణాలు చేసిన, సమీపంలో నివాసం ఉంటు న్న.
ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ చివరకు కోర్టును ఆశ్రయించాల్సి న పరిస్థితి వచ్చినా, మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నా రంటే అధికారులు మామూలుగా తలగ్గినట్లు వస్తున్న ఆరోపణలను ధ్రువపరుస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కార్యాలయానికి అతి సమీపంలో ఇంటి నిర్మాణం కోసం అనుమతులు పొంది, సద రు ఆ పెద్దమనిషి నిబంధనలను అతిక్రమిం చి ఏకంగా ఫంక్షన్ హాల్ నిర్మించిన పట్టించుకోలేదు. నిర్మాణం పూర్తి చేసి దర్జాగా వ్యాపారం సాగిస్తున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రజల నుంచి, అట్టభిశాఖ అధికారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన, సమీపంలో నివాసం ఉంటున్న వారు కోర్టు ను ఆశ్రయించడంతో కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చి వేత పై షో కాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. దీంతో నోటీస్ ఆధారంతో ఆ ప్రబుద్ధుడు కో ర్టును ఆశ్రయించారు. చివరకు వివాదం కో ర్టులో ఉంది. విచారణ పూర్తి కాకపోయినా ఫంక్షన్ హాల్ నిర్వహణ మాత్రం యధావిధిగా కొనసాగుతుంది.
ఇదిలా ఉండగానే ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో గల 12 అడుగుల మున్సిపల్ రోడ్డును సగానికి పైగా ఆ క్రమించి గోడలు నిర్మించారనే ఆరోపణలు వెలవడుతున్నాయి. ఇండ్ల నడుమ ఫంక్షన్ హాల్ నిర్వహణ కారణంగా చుట్టుముట్టు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ లబోదిబోమంటున్న అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని తెలుస్తోంది.
మరోవైపు పార్కింగ్ సమస్యతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అనుకో ని సందర్భంలో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఫైర్ ఇంజన్ తిరిగే పరిస్థితి కాదు కదా ప్రమాదం నుంచి ప్రజలు తప్పించుకునే పరిస్థితి లేని ఇరుకు రోడ్డు గా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సదరు ఆ పెద్దమనిషి పాల్వంచ వర్తక సంగం కన్వీనర్ గా గత కొన్ని ఏళ్ల తరబడి కొనసాగటం మరో ఆరోపణ.
ధన బలం కారణంగా వ్యా పారులెవ్వరు నోరు మెదపకపోవడంతో ఆయన ఆడింది ఆట పాడండి పాటగా సాగుతోందని తెలుస్తోంది. ఆ ప్రబుద్ధుడికి రోజువారి వడ్డీ వ్యాపారం మినహా మరో వ్యాపారం లేదు. వ్యాపారమే లేని అతనికి కన్వీనర్ ఏమిటని కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన కనుసన్నాలోనే పా ల్వంచ పట్టణ వ్యాపారాలు సాగాలని, ఎవరైనా వ్యతిరేకిస్తే అధికారులను పురమా యించి కేసులపాలు చేస్తారనే ఆరోపణలు లేకపోలేదు.
ఏళ్ల తరబడి పట్టణంలో సరసమైన ధరకు శుభా, అశుభా కార్యక్రమాలు నిర్వహణకు సామాన్యులకు వీలుగా ఉన్న వర్తక సంఘం భవనం, నేడు పడావుపడిం దంటే ఆయన దయేని కొందరు విమర్శిస్తున్నారు. పథకం ప్రకారం తన ఫంక్షన్ హాల్ వ్యాపారం కొనసాగాలని వర్తక సంగం భవనాన్ని బ్రష్టు పట్టించారని బహిరంగంగా విమర్శిస్తున్నారు.
మున్సిపల్ ఆర్జెడి స్థాయి అధికారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి అక్రమ ఫంక్షన్ హాల్ నిర్మాణం, నిర్వహణలపై, రో డ్డు ఆక్రమణ, అధికారుల మామూల వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల ని, ప్రమాదాలు చోటుచేసుకోక ముందే ఫం క్షన్ హాల్ నిర్వహణపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వివాదం కోర్టు పరిధిలోకి..
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి అతి సమీపంలో అక్రమంగా కొనసాగుతు న్న గణేష్ హెచ్ కన్వర్షన్ హాల్ నిర్మాణం ని ర్వహణలపై కార్పొరేషన్ కమిషనర్ సుజాత న వివరణ కోరగా... అక్రమ నిర్మాణాలపై కూల్చివేతకు నోటీసు జారీ చేశామని, అత ను కోర్టును ఆశ్రయించడంతో వివాదం కోర్టు పరిధిలోకి చేరిందన్నారు. వెనక భా గంలో మున్సిపల్ రోడ్డు ఆక్రమణ విషయా న్ని ఆమె దృష్టికి తీసుకు వెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.