calender_icon.png 6 October, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనస్ కాదు.. అంతా బోగస్

06-10-2025 12:00:00 AM

  1. ధాన్యం అమ్మి ౪ నెలలు గడిచిన ఖాతాలో జమగాని డబ్బులు

జిల్లాలో 12.81 కోట్లు బకాయి

కొత్త సీజన్ ప్రారంభమవుతున్న పాత బకాయిపై అనుమానం

ఈ సీజన్లో బోనస్ డబ్బులపై అనుమానమే..?

నిర్మల్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ప్రజ ల చేత ఎన్నుకోబడ్డ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలను రైతులను మోసం చేస్తూనే ఉంది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సన్న రకం వరి ధాన్యముకు క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించిన జిల్లా లో చాలామంది రైతులకు గత సీజన్ వడ్ల సంబంధించిన బోనస్ రాకపోవడం రైతులను ఇబ్బంది గురిచేస్తుంది.

జిల్లాలో సన్నా రకం వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు ఇప్పటికీ 12.81 కోట్ల బోనస్ డబ్బులు రైతు ఖాతాలో జమ చేయకపోవడంతో బోనసంతా బోకసుగా రైతులు బహిరంగంగానే విమర్శి స్తున్నారు. నిర్మల్ జిల్లాలో 2025 సం వత్సరగాను యాసంగిలో 1,25,000 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు.

ఇందులో 60000 ఎకరాలు సన్న రకాలు సాగు చేశారు ఇందులో 1.81 లక్షల మెట్రి టన్నుల  వరి ధాన్యం రాగా అందులో 1.5 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు దొడ్డు రకం 25.52 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం సేకరించారు జిల్లావ్యాప్తంగా 42,0 32 మంది రైతులకు 419 కోట్లు డబ్బులు చెల్లించారు  . ఇందులో సన్న రకం వరి ధాన్యం విక్రయించిన రైతుల సంఖ్య 4483 కాగా అందులో కేవలం 20 శాతం మంది రైతులకు మాత్రమే బోనస్ డబ్బులు చెల్లించగా ఇంకా 12.80 కోట్ల బకాయి రైతు ఖాతాలో జమ చేయవలసి ఉంది ప్రభుత్వ కార్యాల యం చుట్టూ బోనస్ డబ్బుల కోసం డబ్బుల కోసం రైతులు తిరుగుతున్న.

అధికారులు మాత్రం ప్రభుత్వ నిధులు విడుదల చేయగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని దాటవేస్తున్నారు యాసంగిలో ఏప్రిల్ మే నెలలో వడ్ల కొనుగోలు పూర్తి చేసిన అధికారులు ఇప్పటివరకు మద్దతు ధరకు సం బంధించిన డబ్బులు ఖాతాలో జమ చేసినప్పటికీ బోనస్ డబ్బులు ఖాతాల్లో నాలుగు నెలలుగా జమ చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం మం త్రులు అధికారులు వరి పంటకు బోనస్ ఆర్భాటాలు ప్రకటించి ఇప్పుడు డబ్బులు విడుదల చేయకుండా స్పష్టత ఇవ్వకపోవడంపై గ్రామీణ రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ పథకం 100% మంది రైతులకు అమలు కాకపోగా బోనస్ డబ్బులపై కూడా ఇదే పరిస్థితి నెలకొనడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉందని రైతాం గం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు

ఈ సీజన్లో బోనస్ అనుమానమే?

సన్న రకాల సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించింది ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్వయంగా రైతులకు వరి ధాన్యం బోనస్ పదేపదే ప్రచారం చేశారు.. పోయినసారి సన్న రకాలు సాగు చేసి పంటను విక్రయించిన రైతులకు పంట అమ్మి నాలుగు నెలలైనా బోనస్ డబ్బులు రాకపోవడంతో ఈ సీజన్లో వారి ధాన్యం బోనస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నా యి.

ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. జిల్లాలో పంట సాగు ఆధారంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా నిర్మల్ జిల్లాలో 348 వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభిం చారు.

అయితే రైతులకు గత సీజన్లో కొనుగోలు చేసిన వర్ధాన్యంపై చెల్లించవలసిన బోనస్ బకాయి ఇప్పటికి చెల్లించకపోవడంతో ఈ సీజన్లో సన్న రకం వరి ధాన్యానికి బోనస్ ఉంటుందా ఉండదాన అనుమానం వ్యక్తం అవుతుంది ఒక్క సీజన్ కే పరిమితమయ్యింది. రబీలో సన్న వడ్లు పండించి కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు ఇప్పటికీ ప్రోత్సాహకం అందలేదు. పం టను విక్రయించి నాలుగు నెలలు దాటినా బోనస్ రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

ఆందోళనలో అన్నదాతలు..

జిల్లా ప్రధాన పంట వరి. గతంలో రైతు లు దొడ్డురకాలనే ఎక్కువగా సాగు చేసేవా రు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. సహజంగా సన్నాల కంటే దొడ్డు రకాలకే దిగుబడి ఎక్కువగా వస్తుంది. యాసంగిలో సన్నాల దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వం బోనస్ ఇస్తామనడంతో రైతులు ఆశతో సన్నాల సాగుపై దృష్టి పెట్టా రు.

గత ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం ఎకరాకు రూ.500చొప్పున బోనస్ అందించింది. రబీకి సంబంధించి ఇప్పటివరకు రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో నే బోనస్ ఇవ్వని సర్కారు.. ఖరీఫ్ ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వక పోతే రైతులు మళ్లీ పాత పద్దతిలో దొడ్డు రకాల సాగుకు మళ్లే అవకాశాలున్నాయి.

ప్రతిపక్షాలకు విమర్శల అస్త్రం

జిల్లాలో సన్న రకం వరి సాగును చేసిన రైతులకు ప్రభుత్వం అందించే బోనస్ ఇప్పటికీ రైతు ఖాతాలో జమ చేయకపోవడం 100% రుణమాఫీ కాకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలకు ప్రధాన అస్త్రంగా ఏర్పడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించి ఎన్నికలకు సిద్ధమౌతున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో రైతులకు జరిగిన నష్టంపై ప్రధాన బిజెపి బీఆర్‌ఎస్ పార్టీలు రైతులతో కలిసి ప్రభుత్వంపై వ్యతిరేకత చాటేలా కార్యచరణతో ముందుకు పోతున్నారు.

రైతుబంధు సహాయం కూడా ఇప్పటికీ రెండు సార్లు ఎగవేత వేయగా ఈసారి అక్టోబర్ ప్రారంభమవుతున్న పెట్టుబడి సాయంపై ప్రభుత్వ స్పష్టత ఇవ్వకపో వడం పై కూడా ప్రతిపక్షాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై విమర్శించే అవకాశం ఉందని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు బోనస్ డబ్బులతో పాటు రైతు సమస్యలపై వెంటనే స్పందించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థ ల ఎన్నికలను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభు త్వ వైఫల్యాలపై ఇప్పటికి పార్టీల నేతలు ప్రజల్లోకి ఎలా వెళ్లాలో ప్రత్యేక కార్యచరణ రూ పొందించి అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ముఖ్య నేతలు తెలిపారు.

నిధులు విడుదల కాగానే జమ చేస్తాం..

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన సన్న రకం వరి ధాన్యం బోన స్‌పై స్పష్టతతో ఉంది. ధాన్యం విక్రయించిన రైతులకు ఇప్పటికీ చాలా మంది ఖాతాల్లో బోనస్ డబ్బులను జమ చేశారు  జిల్లాలో మిగతా పూన స్ డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వానికి విన్నవించడం త్వరలో డబ్బు లు జమ కానున్నాయి రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దు.

సుధాకర్ సివిల్ సప్లై, డీఎం నిర్మల్