06-10-2025 12:00:00 AM
- భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలో ఆరితేరుతూ..
- సెటిల్మెంట్ల దందాలో పలు శాఖల ఉద్యోగులు
- ఉద్యోగాల పేరిట పేదలకు టోకరా
-నిద్రావస్థలో జిల్లా ఉన్నతాధికారులు
సంగారెడ్డి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): సర్కారు నౌకరి.. లక్షల్లో జీతం..దర్జాగా విధు లు నిర్వహిస్తూ పేదలకు సేవ చేయాల్సిన కొంత మంది ప్రభుత్వ అధికారులు కాసుల కు కక్కుర్తి పడుతున్నారు. ధనార్జనే ధ్యే యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజ ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అక్రమాలకు ఒడిగడుతున్నారు. అక్రమ దం దాలు, సెటిల్మెంట్లలో వీరి పాత్ర ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ అధికారుల తీరుపట్ల ఆ శాఖలకు మచ్చ తెచ్చేలా కనిపిస్తోంది. జనం నుంచి వీరికి ఛీత్కారాలు తప్పట్లేదు.
అక్రమాలకు అడ్డా..
ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరగాలంటే మున్సిపల్ నుంచి అసెస్మెంట్ తప్పనిసరి. భవన నిర్మాణాలు ఉంటేనే వాటిని జారీ చేయాలి. కానీ కొంతమంది మున్సి పల్ ఉద్యోగులు, అధికారులు కాసులకు కక్కుర్తిపడి దొడ్డిదారిన అసెస్మెంట్లు జారీ చేస్తున్నారు. వాటి సా యంతో తప్పుడు పత్రాలను సృష్టించి అక్ర మా ర్కులు రిజిస్ట్రేషన్ శాఖలో తమ పని కా నిచ్చేస్తు న్నారు. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే వారి లింక్ డాక్యుమెంట్లు, భూమి అసైన్డ్, ప ట్టా ల్యాండ్, ప్రభుత్వ భూమినా అనే వివరాలు పరిశీలించాల్సి ఉంటుంది. నిబంధన లకు అనుగుణంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చే యాలి. కానీ సంబంధిత అధికారులు కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల సాయంతో అక్రమాలకు తెర లేపుతున్నారు. ఇది ఒకెత్తు అయితే.. మరోవైపు ఇదివరకే రిజిస్ట్రేషన్ అయి ఉన్నవాటికి డ బుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. తద్వారా అర్హులైన వారికి అన్యాయం జరుగుతోంది.
నిబంధనలు తుంగలో తొక్కుతూ..
ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి వ్యాపారం చేయరాదు. ప్లాట్లు, భూములు కొనుగోలు చేస్తే సంబంధిత శాఖ ఉన్నతాధికారికి సమాచారం అందించాలి. సొంత డబ్బుతో కొను గోలు చేస్తున్నాడా.. బ్యాంక్ నుంచి రుణం పొందుతున్నాడా అనే విషయాలను తెలియజేయాలి. అయితే జిల్లాలో చాలా మంది ఉ పాధ్యాయులతో పాటు ఉద్యోగులు రియల్ ఎస్టేట్ దందాలో ఆరితేరి అక్రమంగా రూ. లక్షల్లో ఆర్జిస్తున్నారు. తన పేరుతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఉద్యోగం చి న్నదైనా రూ.కోట్లకు పడగలెత్తుతున్నారనే ఆ రోపణలు ఉన్నాయి. భూ దందాతో పాటు చిట్టీలు నడపడం, పత్తి వ్యాపారం, మద్యం దుకాణాల్లో వాటాలు, ఇసుక దందా, సెటిల్మెంట్లు వంటివి చేస్తూ అక్రమాలకు పాల్ప డుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా అధికారుల నిద్రావస్థ..
జిల్లాలో పలు శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు సైడ్ దందాగా రియల్ ఎస్టేట్, ఇ సుక దందా తదితర వాటిల్లో వాటాలు కలిగివుంటున్నా..పరోక్షంగా సహకారం అంది స్తున్నా ఉన్నతాధికారులకు తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వారి దందాలకు సైతం ఉ న్నతాధికారులు సహకరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అంతేగాకుండా కొన్ని శాఖల్లో అక్రమార్కులకు సహకారం అందిస్తున్న ఉద్యోగులు ఉన్నతాధికారులను ప్రస న్నం చేసుకోవడానికి పెద్ద ఎత్తున మామూ ళ్ళు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రధానంగా మున్సిపల్, రిజిస్ట్రేషన్, విద్య, వైద్యం శాఖల్లో ఈ వ్యవహారం జోరుగా సా గుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఆయా శాఖలపై పర్యవేక్షణ చేసి చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు.