calender_icon.png 18 October, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర దర్యాప్తులో ఆధారాలు చాలా కీలకం

17-10-2025 12:09:55 AM

పోలీస్ కమిషనర్ సునీల్ దత్

ఖమ్మం, అక్టోబరు 16 (విజయక్రాంతి) : నేర దర్యాప్తులో ఆధారాలు చాలా కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో గల భవనంలోని ఆధునికీకరించిన ఫింగర్ ఫ్రింట్ యూనిట్ కార్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ, ఫింగర్ప్రింట్ యూనిట్లలోని కార్యాచరణను వేగవంతం చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్లను ఉపయోగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

పోలీసు శాఖలో ఫింగర్ప్రింట్ యూనిట్ అనేది వేలిముద్రల శాస్త్రీయ విశ్లేషణ ద్వారా నేరాలను పరిష్కరించడానికి,  అనుమానితులను గుర్తించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. క్రైమ్ సీన్ నుంచి సేకరించిన  వేలిముద్రలు అనుమానితుల రికార్డులతో సరిపోల్చడం, నేర పరిశోధనలో సహాయం చేయడం వంటి వాటిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నారు. ఈ  కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా &అర్డర్ ప్రసాద్ రావు, ఏ ఆర్ ఏసీపీ సుశీల్ సింగ్,  క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ నరేష్, ఆర్ ఐ కామరాజు, సురేష్, ఇన్స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.