calender_icon.png 19 October, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీ వాహనాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

17-10-2025 12:10:44 AM

ఆటోలు బైక్లు స్వాధీనం. ఇద్దరి అరెస్టు.. ముగ్గురు పరారీ

నిజామాబాద్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి) : నిజామాబాద్, జగిత్యాల్ నిర్మల్ జిల్లాలలో వాహనాల దొంగతనాల పాల్పడి నకిలీ నంబర్ నంబర్లతో వాహనాలను అమ్ముతున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను సిసిఎస్ పోలీసులు పక్కా సమాచారం తో వలపన్ని పట్టుకున్నారు. జగిత్యాల జిల్లాలో చోరీ వాహనాలను అమ్ముతున్న వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ ముఠాలో పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటీవల జగిత్యాల జిల్లాలో ఒక ఆటో కు స్థానిక పోలీసులు జరిమానా విధించారు. ఆ జరిమాన తాలూకు రసీదు కామారెడ్డి చెందిన వ్యక్తికి కి చేరింది. ఆ ఆటో యజమాని తాను అసలు జగిత్యాల జిల్లాలో తిరగనే లేదని పైను కట్టేదే లేదని తేల్చి చెప్పేశాడు. ఈ విషయమై దోస్తీ సారించిన పోలీసు కమిషనర్ సాయి చైతన్య సిసిఎస్ పోలీసుల  టీంని విచారణకు ఆదేశించారు.

సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి సీఐలు సాయినాథ్ సురేష్ గోవింద్ సిబ్బంది ఆధ్వర్యంలో చోరీ వాహనాల ను అమ్మే ముఠా ను ఛేదించారు. సిసిఎస్ ఏసిపి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తమకు అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు సిసిఎస్ టీం ఆటో నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ పజిల్ ఆటోనగర్ కు చెందిన ఎలక్ట్రిషన్ గా పనిచేసే మహమ్మద్ నవాజ్ లను అదుపులోకి తీసుకున్నారు వారిని విచారించగా నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్ కు చెందిన షేక్ అలీ అలీమ్ లతో పాటు పిఎంపి వైద్యుడుగా పనిచేస్తున్న ఆటోనగర్ కు చెందిన మహమ్మద్ వహీద్ తో కలిసి నిజామాబాద్ బోధన్ ఆర్మూర్ ముధోల్ జిల్లాల్లో ఆటోలు బైకులు దొంగతనాలకు పాల్పడినట్లు షేక్ పజిల్ మొహమ్మద్ నవజ్ లు పోలీసుల విచారణలో వెల్లడించారు.

దర్యాప్తులో పై ఇద్దరు ఇచ్చిన సమాచారంతో వాటిని అమ్మిన జగిత్యాల జిల్లా కోరుట్లలో 9 ఆటోలు మూడు మోటార్ సైకిల్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షేక్ అలీ అలీమ్ మహమ్మద్ పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. చోరీ ఆటోలు బైక్ లను కొనుగోలు చేసిన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం బెల్లంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఇలియాస్ ల ద్వారా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్పటివరకు నాలుగు ఆటోలు మూడు మోటార్ సైకిల్ అడ్రస్లు లభించాయని వాటిని ఆయా పోలీస్ స్టేషన్లో కు అప్పగిస్తామని సిసిఎస్ ఏసిపి తెలిపారు పరారీలో ఉన్న ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నకిలీ నంబర్ ప్లేట్లతో చోరీ వాహనాల అమ్మకాలను కొనసాగిస్తున్న ముఠా గుర్తు రక్తం చేసిన సిసిఎస్ పోలీసుల పనితీరును కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. విలేకరుల సమావేశంలో సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి సిఐలు సాయినాథ్ సురేష్ ఎస్ ఐ నారాయణ కానిస్టేబుల్  ఉన్నారు