calender_icon.png 18 October, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై తీవ్ర సెక్షన్లతో కేసులు నమోదు చేయాలి

17-10-2025 12:09:15 AM

హెచ్చరించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ 

నిజామాబాద్, అక్టోబర్ 16 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను  అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నగరంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు.

కేటీఆర్ పై పరమైన చర్యలు చేపట్టకుంటే రాష్ట్రంలోని విద్యార్థులు యువత తో కలిసి పెద్దఎత్తున ఆందోళన లు చేపడుతామని బల్మూరి వెంకట్ హెచ్చరించారు. సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ను పోలీసులు వ్యానులో ఒకటవ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీపీ కార్యాలయాన్ని కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు ముట్టడించారు. 

పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని  ముట్టడించేందుకు గురువారం మధ్యాహ్నం సిపి కార్యాలయానికి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  సిపి కార్యాలయానికి చేరుకున్న వన్ టౌన్ నగర పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్  మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపర్చే విధంగా పోస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కేటీఆర్‌తో పాటు ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ  ఫిర్యాదు తో కూడిన వినతిపత్రం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు అందజేశారు.   

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు తాహెర్ బిన్ హందాన్, గడుగు గంగాధర్, రత్నాకర్, వేణురాజ్, విపుల్ అడ్వకేట్ రాము జెండా బాలాజీ మందిర్ చైర్మన్ ప్రమోద్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.