calender_icon.png 22 September, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరించి హాస్పిటల్‌లో ఈడబ్ల్యూఎస్ సౌకర్యం

22-09-2025 12:39:35 AM

ప్రారంభోత్సవానికి హాజరైన మాధవీలత కొంపెల్ల

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): విరించి ఆసుపత్రి, పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఓ ప్రత్యేకమైన ఆరోగ్య వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) ఫెసిలిటీని ఆదివారం మాధవీలత కొంపెల్ల ప్రారంభించారు.

వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను చౌకగా అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఆసుపత్రి అవుట్ అన్ని సేవల్లో 80 శాతం వరకు రాయితీతో కన్సల్టెషన్, పరీక్షలు అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ పథకాలకు అర్హత లేని కుటుంబాలు, ఇన్స్యూరెన్స్ లేని వారు ఈ వెసులుబాటు ద్వారా వైద్య సేవలు పొం దొచ్చు.

ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. ‘ఆరోగ్యమనేది హక్కు మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి మౌలిక హక్కు. ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా విరించి ఆస్పత్రి అనేక కుటుంబాలకు వైద్య సేవలు మాత్రమే కాకుండా సామాజిక సమానత్వం, వైద్య సేవలపై విశ్వాసాన్ని అందిస్తుంది. ఈ వెసులు బాటు ద్వారా పరీక్షలు, కన్సల్టేషన్లు, ఔషధాలు నిర్ధారించిన రాయితీతో, అందుబాటు ధరకే అందించడం జరుగుతుంది.

‘హెల్త్‌కేర్ ఫర్ ఆల్’ అనే నినాదంతో ముందుకు సాగుతున్న విరించి ఆస్పత్రి, ఇప్పుడు ఈ ఈడ్ల్యూఎస్ ఫెసిలిటీ ప్రారంభోత్సవంతో తన తాదాత్మ్యంతో కూడిన వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రైవేట్ ఆరోగ్య రంగంలో ఇది ఓ కొత్త ప్రయాణంగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.