29-09-2025 12:00:00 AM
కరీంనగర్ క్రైం , సెప్టెంబర్28(విజయక్రాంతి): కోటా ఇన్స్టిట్యూట్ కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థుల కెకొసం కోటా-సీట్- 2025 స్కాలర్షిప్ టెస్ట్ ఆదివారం నిర్వహించబడింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి సుమారు 1000 మంది విద్యార్థినివిద్యార్ధులు ఐఐటీజేఈఈ, నీట్ వంటి శిక్షణ కోసం ఈ పరీక్షలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు 100% వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం కల్పించబడింది.కోటా ఇన్స్టిట్యూట్ తరఫున, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు ఇన్స్టిట్యూట్ చైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. పరీక్ష ద్వారా మరిన్ని ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంపిక కానున్నారనితెలిపారు.