calender_icon.png 14 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహాన్ని బిజెపి నాయకులు శుభ్రం

13-04-2025 09:56:58 PM

మునగాల: మండల కేంద్రములో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్  విగ్రహమును   అంబేద్కర్  జయంతి సందర్భంగా  భారతీయ జనతా పార్టీ నాయకులు శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య మాట్లాడుతూ... అంబేద్కర్  ఎందరికో ఆదర్శనీయమన్నారు. నీతికి నిజాయితీకి మారుపేరు అని చెప్పిన మాట నిలబెట్టుకోవడంలో ముందుండే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  అన్నారు. అంబేద్కర్  పుట్టినరోజును భారత ప్రజలందరూ సమానత్వ దినోత్సవం గా జరుపుకుంటారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మునగాల మండల అధ్యక్షుడు శ్రీ భద్రంరాజు కృష్ణ ప్రసాద్ బిజెపి సీనియర్ నాయకులు యాద రమేష్ బిజెపి సూర్యాపేట జిల్లా ఆర్టిఐ సెల్ కన్వీనర్ కొండ్లే రవికుమార్ మైలారిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.