29-11-2025 12:47:33 AM
అస్తిత్వం కోసమే ప్రతిపక్షాలు...
గ్రామాల్లో మొదలైన ఎన్నికల సందడి
బెల్లంపల్లి అర్బన్, నవంబర్ 28: తొలి విడత నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. రెండో విడత నామినేషన్లకు దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తులో మునిగిపోయారు. ప్రజాధారణ ఉన్న అభ్యర్థుల జాబితా కసరత్తులు పార్టీలు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజెపి, వామపక్షాలు అభ్యర్థుల ఎంపిక లో బిజీబిజీగా ఉన్నాయి. దీంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం నెలకొంది.
నామినేషన్ ఘట్టం సమీపిస్తుండటంతో పొలిటికల్ వెదర్ మరింతగా వేడెక్కుతున్నది. బెల్లంపల్లి నియోజక వర్గంలో స్థానిక ఎన్నికల నామినేషన్లు రెండో విడతలో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మరింత దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో టెన్షన్ నెలకొంది. బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, కన్నెపల్లి, నెన్నెల, భీమి ని, వేమనపల్లి మండలాల్లో నామినేషన్ల ప్రక్రి య రెండో విడతలో జరుగుతుంది.
ఒక్కో మండలంలో సర్పంచ్ అభ్యర్థుల జాబితా ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ అధికంగా ఉండటంతో ఎంపిక ప్రక్రియ ఆలస్యమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి పోటీ అధికంగా కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. నియోజక వర్గంలోని అన్నీ గ్రామా ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
అధికార పార్టీలో ఆశావహుల నుంచి పోటీ మరీ ఎక్కు వ ఉండటంతో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో పెద్ద నాయకులు అచితూచిగా వ్యవహరిస్తున్నారు. ఆశావహుల నుంచి పోటీ గట్టిగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆయా గ్రామస్థాయి లీడర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.
సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రత్యేకంగా గ్రామాల్లో సమావేశాలు జరుపుతు న్నారు. అందరి ఆమోదంతో అభ్యర్థుల ఎంపి క చేయడం వల్ల అసంతృప్తులకు అవకాశం ఉండదని భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఎంపిక కోసం తలపెట్టే సమావేశాలు ఆయా గ్రామాల్లో గరంగరంగా తలపిస్తున్నాయి.
సర్పంచ్ అభ్యర్థులకు పోటీ పెరగడంతో అభ్యర్థుల ఎంపికలో నియోజక వర్గంలోని కొన్ని మండలాల్లో సమావేశాల్లో వాడి వేడి వాతావరణం తప్పడం లేదు. ఎంతో కాలంగా ఎదు రుచూస్తున్న ఆశావాహులకు అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అభ్యర్థిత్వం విషయంలో తగ్గేదే లేదన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారు.
టికెట్ ఆశిస్తున్న వారిని ఎలా సంతృప్తి పరచాలో, ఎవరిని నిలబెట్టాలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ అధిష్టానానికి పరీక్షగా మారిందనడంలో సందేహం లేదు. ఏదేమైనా ఆశావాహులు తలచినట్టుగా తమకు అభ్యర్థిత్వం రాకపోతే రెబల్‌గా నామినేషన్లు వేసే పరిస్థితి ప్రతి మండలంలో కనిపిస్తోంది. నామినేషన్ ఘట్టానికి మరింత దూరం లేకపోవడంతో ఆయా ప్రధాన పార్టీల లీడర్లు సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై అహర్నిశలు కష్టపడుతున్నారు.