29-11-2025 12:45:57 AM
ప్రధానికి టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ప్రధాని మోదీకి టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేసినట్లు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2017లో పార్లమెంట్ చట్ట సవరణను రద్దు చేయాలని ఆయన కోరారు.