calender_icon.png 29 November, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంటల్లో చిక్కుకొని రైతు మృతి

29-11-2025 12:47:49 AM

ముగ్పాల్ గ్రామంలో గడ్డికుప్పకు నిప్పు పెడుతుండగా ఘటన 

ముగ్పాల్ నవంబర్ 28: (విజయ క్రాంతి): నిజామాబాద్ రూరల్ పరిధిలోని ముగ్పాల్ గ్రామానికి చెందిన రైతు జక్కు దేవయ్య (74) దురదృష్టకరంగా మంటల్లో చిక్కుకొని మృతిచెందారు. ఈనెల 17న తన పొలంలో గడ్డికుప్పకు నిప్పు పెడుతుండగా మంటలు ఆయన దుస్తులకు అంటుకోవడంతో తీవ్రంగా కాలిపోయాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటనపై మృ తుడి కుమారుడు జక్కు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ముగ్పాల్ ఎస్‌ఐ జెడ్. సుష్మిత ప్రకటనలో తెలిపారు.