17-06-2025 12:40:44 AM
యాదాద్రి భువనగిరి జూన్ 16 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూళ్ళలో వసూలు చేస్తున్న అధిక ఫీజులను నివారించాలని ఎస్ యు ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎం ఎస్ యు ఐ నాయకులు సురుపంగ చందు మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్ళలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పేరెంట్స్ కమిటీ సూచనల మేరకు ఫీజులను తీసుకోవాలని, పుస్తకాలను స్కూళ్ళలో విక్రయించకూడదని, ఫిట్ నెస్ లేని బస్సులను నడపవద్దని, ఎలాంటి అనుమతులు లేని స్కూళ్లను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,
తరగతులు ప్రారంభం కాకముందే 50 శాతం ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యార్ధుల సంఖ్యపరంగా బోధన సిబ్బంది లేకపోవడం, విద్యార్హత లేని వారితో విద్యా బోధనలు చేస్తు విద్యార్ధుల పై జరుగుతున్న ఆర్థిక దోపిడీని అరికట్టి న్యాయమైన విద్యా హక్కులను విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ యు ఐ నాయకులు ఎండి. అసద్ తదితరులు పాల్గొన్నారు.