04-07-2025 01:11:48 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): పచ్చదనాన్ని భారీగా పెంచాలన్న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల ఆదేశాల మేరకు సింగరేణి గనుల ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటడానికి, పలు రకాల పర్యావరణహిత చర్యలు చేపట్టడానికి ప్రముఖ యోగా, పర్యావరణ సంస్థ హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ (కన్హా ఆశ్రమం)తో సింగరేణి సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
గురువారం హైదరాబాద్ సమీపం లోని కన్హా శాంతివనం ఆశ్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి సమక్షంలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సంజయ్ సెహగల్ సంతకాలు చేశారు. ఇదే తరహాలో కోల్ ఇండియా కూడా కన్హా ఆశ్రమంతో ఒప్పం దం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఈ ఒప్పందం ప్రకారం ఎకో పార్కు లు నిర్మించడం, వర్షారణ్యాలు, హరిత కంచెల ఏర్పా టును చేపట్టనున్నారు. ఓపెన్‌కాస్ట్ గనుల ఓవర్ బర్డెన్ డంపులపై, ఖాళీ ప్రదేశాల్లో, బొగ్గు రవాణా బెల్టులకు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచనున్నారు. ప్రతి ప్రదేశంలో నాటిన మొక్కలు 90 శాతంపైగా నాటుకుని వృక్షాలుగా పెరగడానికి కన్హా ఆశ్రమం కృషి చేస్తుంది.
తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల ఆదేశాల మేరకు మొక్కల పెంపకాన్ని ఉధృతం చేసేందుకు వీలుగా కన్హా ఆశ్రమంతో ఒప్పందం చేసుకున్నామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి రూపేంద్ర బ్రార్, సింగరేణి డైరెక్టర్ గౌతం పొత్రు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాంకేతికత వృద్ధిలో ఎన్‌ఎఫ్‌టీడీసీ కీలకపాత్ర..
సాంకేతికతను వృద్ధి చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలో మరింత ప్రగతి సాధించేందుకు నాన్‌ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎన్‌ఎఫ్‌టీడీసీ) తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కొనియాడారు. గురువారం హైదరాబాద్‌లోని నాన్-ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్(ఎన్‌ఎఫ్‌టీడీసీ)ను సందర్శిం చి, సంస్థ పనితీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమం త్రి మాట్లాడుతూ.. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించిన సందర్భంలో మినరల్స్ రీసైక్లింగ్, ప్రాసె సింగ్ ప్రక్రియకు ఈ కేంద్రం కీలకంగా మారుతుందన్నారు. అడ్వాన్స్‌డ్ మ్యాగ్నెట్స్, స్ట్రాటజిక్ మెటీరియల్స్ టెక్నాలజీస్ విషయంలో అంతర్జాతీ య కేంద్రంగా సంస్థ ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు.