calender_icon.png 11 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నరు!

11-05-2025 02:15:06 AM

- సంక్షేమ పథకాలు చేపట్టడం అన్యాయమా?

- కేసీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

- రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టింది

- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అశ్వారావుపేట, మే 10: దొరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారని, తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుంటే న్యాయమా అని ప్రశ్నించారు.

శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో రూ.40 కోట్లతో ఆరు విద్యుత్ ఉప కేంద్రాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాప నలు చేశారు.  అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన భహిరంగ సభలో భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. పదేళ్లు రాష్టాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రాన్ని జలగల్లా పీల్చిపిప్పి చేసిందన్నారు. 

అడ్డుగోలుగా సంపాదించన సొమ్మును ఫామ్‌హౌస్‌లో నుంచి ఖర్చుపెడుతూ, సభలు పెట్టి నోటి కి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలు తెచ్చి గోదావరిలో పోశారని విమర్శించారు. పదేళ్లలో ఒక్కసారైనా గ్రూపు పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు.

తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే  57 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 30 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఏ సంక్షేమ పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపలేదని తెలిపారు. గిరిజనుల  వ్యవసాయం కోసం రూ.12,500 కోట్లతో ఇందిర గిరి జల వికాస్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. 

ఉచిత కరెంటు ఘనత కాంగ్రెస్‌దే: పొంగులేటి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గం అన్ని రంగా ల్లో అభివృద్ధి చేయాలనదే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. కాగా ఉచిత కంరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. ఒక్క రైతుకు కూడా ఉపయోగపడని ధరణిని పక్కన పెట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చినట్టు తెలిపారు.

విద్య వైద్య రంగాలకు పెద్ద పీట వెస్తున్నట్టు తెలిపారు. చండ్రుగొండ మండలంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వెంగళరావుసాగర్ అలుగు కొట్టుకుపోయి 8 సంవత్సరాలు కావస్తున్న బీఆర్‌ఎస్ పట్టించుకోలేదన్నారు. దీంతో 2,200 ఎకరాల ఆయకట్టు సాగు లేకుం డా పోయిందన్నారు.

వెంగళరావుసాగర్ మరమ్మతుల కోసం కాంగ్రెస్ రూ.42 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. త్వరలోనే టెండర్‌లు పూర్తి అవుతాయని తెలిపా రు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, ఖమ్మం ఎంపీ రామసహయం రఘురామరెడ్డి, టీజీఎన్‌పీడీసీఎల్‌సీ ఎంఅండ్‌డీ వరుణ్‌రెడ్డి, కలెక్టర్ జితీష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.