11-05-2025 02:10:11 AM
- రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ అమరేందర్‌రెడ్డి
కరీంనగర్, మే 10 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ అమరేందర్‌రెడ్డి రూ.60 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని ముస్తాబాద్ మం డలం ఆవునూరు వద్ద నిర్మించిన చెక్‌డ్యాం బిల్లుల విడుదల కోసం సూరం రవీందర్ అనే కాంట్రాక్టర్ వద్ద రూ. లక్ష లంచం డిమాండ్ చేయగా రూ.75 వేలకు ఒప్పుకున్నాడు.
కరీంనగర్‌లోని విద్యారణ్యపురి కాలనీలోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి 8 గంటలకు రవీందర్ వద్ద రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారు లు పట్టుకున్నారు. గతంలోనూ ఇదే కాంట్రాక్టర్ వద్ద సుమా రు రూ.4 లక్షల వరకు లంచం తీసుకున్నట్లు సమాచారం.