calender_icon.png 20 May, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్రిక్త ప్రాంతంలో చిక్కుకున్నాం.. రక్షించండి

11-05-2025 02:02:13 AM

- బండి సంజయ్‌కు తెలుగు విద్యార్థుల లేఖ

- తక్షణమే స్పందించిన కేంద్రమంత్రి 

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): గత కొద్దిరోజులుగా పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో కశ్మీర్‌లోని ఇండ్లు, ప్రభుత్వ కా ర్యాలయాలు, ఆర్మీ శిబిరాలపై దాడి చే స్తుండటంతో ఆ ప్రాంత ప్రజలంతా తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు.

ఎప్పుడు జరుగుతుందోనన్న పరిస్థితి నెలకొంది. అక్కడి విమానాశ్రయాలను సైతం మూసేయడంతో కశ్మీర్‌లో చదువుకుంటున్న తెలు గు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ దుస్థితిని వివరిస్తూ 23 మంది తెలుగు విద్యార్థులు కేంద్రమంత్రి బండి సంజయ్‌కు లేఖ రాశారు.

జమ్మూకశ్మీర్‌లోని షేర్- ఈ -కశ్మీరీ వ్యవసాయ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఎస్‌కేయూఏఎస్టీ)లో తెలంగాణ, ఏపీకి చెందిన 23 మంది విద్యార్థులను సంబంధిత జిల్లా కలెక్టర్, వర్సిటీ డీన్‌లతో మాట్లాడి విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. కేంద్రమంత్రి సూచనతో జమ్మూకశ్మీర్ అధికార యం త్రాంగం 23 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది.