05-07-2025 12:38:16 AM
బర్మింగ్‌హమ్, జూలై 4: బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్ (184 నాటౌట్), హారీ బ్రూక్ (158) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు మినహా మిగతావారు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదు డకౌట్లు ఉండటం గమనార్హం. భారత బౌలర్లలో సిరాజ్ 6 వికెట్లతో మెరవగా.. ఆకాశ్ దీప్ 4 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 244 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ (28*), కరుణ్ నాయర్ (7*) క్రీజులో ఉన్నారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (269) డబుల్ సెంచరీతో మెరిశాడు.