calender_icon.png 16 September, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

16-09-2025 12:00:00 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశిం చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో నిర్వహించ నున్న ఈ వేడుకలను పురస్కరించుకుని సోమవారం కలెక్టర్ తన చాంబర్లో సంబం ధిత శాఖల అధికారులతో సమావేశమై ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లపై చర్చిం చారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరి స్తారని అన్నారు. ముఖ్య అతిథితో పాటు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చే యనున్న నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పక్కాగా పర్యవేక్షించాలని అన్నారు.

వేదిక, సిటింగ్ ఏర్పాట్లు, తదితర వాటి గురించి సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.