16-09-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి):రైతులు పంటలకు అవసరమైన యూరియా ఎరువుల కోసం రోడ్ల వెంట పడిగాపులు కాస్తున్నా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వీడటం లేదని బీఎస్పీ నేతలు మండిపడ్డారు. సోమవారం బీఎస్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని బోనాసి రాంచందర్ నేతృత్వంలో,
కొత్తపల్లి కుమార్, కళ్యాణ్, బీసమోళ్ళ యోసేఫ్, పృధ్వీరాజ్, అంతటి నాగన్నలు పాల్గొన్నారు.గ్రామాల్లో మద్యం లభించేంత సులువుగా యూరియా లభించలేదని మండిపడ్డారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, గ్రూప్ వన్ అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అనంతరం వినతిపత్రాన్ని ఏవో చంద్రశేఖర్‌కుఅందజేశారు..