calender_icon.png 28 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలన కాదు దోపిడీ పాలన

28-11-2025 12:00:00 AM

  1. బీసీలకు నమ్మించి మోసం 

12,735 గ్రామాల్లో బీసీలకు కేటాయించిన సర్పంచ్ స్థానాలు కేవలం 2,176 

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ 

గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నిరసన

ముషీరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరా లుగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జీవో 46 అమలు చేయడం తీవ్ర అన్యాయమని, స్థానిక ఎన్నికలు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం, తెలంగాణ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణతో కలిసి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12,735 గ్రామ పంచాయతీల్లో బీసీలకు కేవలం 2,176 స్థానాలు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. బీసీలను రాజకీయంగా తీవ్ర అన్యా యానికి గురి చేశారన్నారు. రిజర్వేషన్లు పెంచుతామని తగ్గించారని మండిపడ్డారు.

బీసీలను తడి బట్టతో గొంతు కోశారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కులగణన లెక్కలను బయట పెట్టరు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లరు, కేంద్ర నాయకులను కలిసి ఒత్తిడి తేరని మండిపడ్డారు. ఇండియా కూటమికి 200 పైగా ఎంపీలు ఉన్నా పార్లమెం ట్‌లో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయాలని, లేనిపక్షంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా ఉరి తీశారని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, తెలంగాణ ప్రజా ప్రతినిధుల ఫోరం యాదయ్య, రాజు కుమార్, రవి, జగదీష్, ప్రవీణ్, వినోద్, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.