calender_icon.png 22 July, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ పట్టెలో నకిలీ మద్యం

22-07-2025 12:18:36 AM

  1. మేళ్లచెరువులో తయారీ ముఠా అరెస్ట్
  2. ఆరుగురిపై కేసు, ఇద్దరు అరెస్టు
  3. రూ.15 లక్షల నకిలీ మద్యం పట్టివేత

హుజూర్‌నగర్ (మేళ్లచెరువు), జూలై 21: సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండలంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సూపరిండెంట్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ నాగా ర్జునరెడ్డి తన సిబ్బందితో సోమవారం జరిపిన అకస్మిక దాడులు జరపడంతో నకిలీ మద్యం గుట్టు రట్టు అయింది. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన తోట శివశంకర్..

సూర్యప్రకాష్‌కు చెందిన ఓ రేకుల షెడ్ గోదాంలో నకిలీ మద్యం తయారు చేస్తుండగా సోమవారం పట్టుకున్నారు. సుమారు రూ.15 లక్షల విలువైన నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రెండు కోట్ల విలువైన నకిలీ మద్యాన్ని తయారు చేసే స్పిరిట్‌తో పాటు 326 లీటర్ల బ్యాటిల్‌లో నింపబడిన 38 కాటన్లను స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేశారు.

నకిలీ మద్యం ముఠాకు చెందిన శివ శంకర్, శ్రీరాం మహేష్, హైదరాబాద్‌కు చెందిన రూతుల శ్రీనివాస్, శ్రీకృష్ణ ఫార్మాకు చెందిన శివ చరణ్‌సింగ్, షెడ్ ఓనర్ సూర్యప్రకాష్‌లపై కేసు నమోదు చేయగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు పరారీలో ఉన్నారు. 

నిందితులు ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు మద్యాన్ని సరఫరా చేసినట్లు ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు జగన్మో హన్‌రెడ్డి, వెన్నెల పాల్గొన్నారు.