23 June, 2026 | 2:34 AM

శేర్‌లింగంపల్లి బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయండి : సతీష్ అరోరా

23-06-2026 12:13 AM

కూకట్‌పల్లి, జూన్ 22 (విజయక్రాంతి): శేర్ లింగంపల్లి నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 23 మంగళవారం ఉదయం 9 గంటలకు మియాపూర్ నరేన్ గార్డెన్  శేర్లింగంపల్లి  బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగు తుందన్నారు.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  అధ్యక్షుడు, మాజీ మం త్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ ముఖ్యఅతిథిగా హాజరౌతారన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు హాజరు కారునున్నారని, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కోరారు.