26-09-2025 07:10:30 PM
కొండపాక: బతుకమ్మ దసరా పండుగ సెలవులతో అనేక కుటుంబాలు సొంత ఊరి బాట పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇళ్లల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే పాఠశాలలకు పండగ సెలవులు ఇచ్చారు. కళాశాలలకు ఈనెల 28 నుంచి సెలవులు రానుండడంతో జాగ్రత్తగా ఉండాలని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేలా తగు చర్యలు తీసుకుంటున్నామని కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. బంగారు నగలు, డబ్బులు ఉంటే వెంట తీసుకువెళ్లాలని, ఊరెళ్ళి వచ్చేవరకు ఇరుగుపొరుగు వారిని అడిగి వివరాలు తెలుసుకోవాలని, పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.