26-09-2025 07:14:45 PM
నంగునూరు: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకంగా శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు) ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపిడిఓ వేణుగోపాల మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధులను, ఓటింగ్‌కు సంబంధించిన నియమ నిబంధనలను, సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరించే విధానాలను ఈ సందర్భంగా వివరించామన్నారు.