calender_icon.png 15 September, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూగజీవాలను పట్టించుకునేది ఎవరు?

15-09-2025 02:35:05 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బజారువాడి, జనకాపూర్ తో పాటు ప్రధాన రోడ్డుపై పదుల సంఖ్యలో ఆవులు కనిపిస్తున్నాయి. యజమానులు వాటిని పట్టించుకోక ఆదరించే వారు కరువై ఘోషిస్తున్నాయి. వీటితో కాలనీలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మూగజీవాలకు తిండి కరువై అల్లాడుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే వాటిని గోశాలకు తరలించి సంరక్షించాలని గో ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.