15-09-2025 03:08:30 PM
రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్
తుంగతుర్తి (విజయక్రాంతి): మున్నూరు కాపులు ఐక్యతతో పాటు సంఘాటీతమై బహుజనులను కలుపుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమ రావు పటేల్ తుంగతుర్తి నియోజక కేంద్రములో రాష్ట్ర కార్యదర్శి గాజుల మహేందర్ పటేల్ గృహములో జరిగిన సమావేశములో మాట్లాడుతూ అన్నారు. మున్నూరు కాపు కులగణనలో మున్నూరు కాపుల శాతం తగ్గింది ఆంటు దానిని సవరించడానికి మా శాతమెంతో.. మేమెంతో అనే పద్దతిలో కుల సంఘం ఆధ్వర్యంలో అతి త్వరలో సర్వే చెప్పాడుతాము అన్నారు. జిల్లా అధ్యక్షులు పుట్ట కిషోర్ పటేల్ మాట్లాడుతూ మున్నూరు కాపు గడప గడపకు సభసత్వం చేపడుతాం అన్నారు. రాష్ట్ర కార్యదర్శి గాజుల మహేందర్ పటేల్, నియోజకవర్గం కోఆర్డినేటర్ పసునూరి శ్రీనివాస్ పటేల్, ఆర్వ పల్లి మండల అధ్యక్షులు చెంచల శ్రీనివాస్ పటేల్, తిరుమల గిరి పట్టణ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ పటేల్ తుంగతుర్తి అధ్యక్షులు ఎలాబోయిన బిక్షం నాయకులు మూర్గండ్ల సోమయ్య పటేల్ తదితరులు పాల్గొన్నారు.