calender_icon.png 11 November, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహ్మద్ ఆమిర్ వీడ్కోలు

14-12-2024 11:28:14 PM

కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే స్టార్ పేసర్‌గా గుర్తింపు పొందిన ఆమిర్ పాక్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 271 వికెట్లు పడగొట్టాడు. 2009లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన పాకిస్థాన్ జట్టులో ఆమిర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఆటగాడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమిర్ వివాదాల్లోనూ ముందు వరుసలో ఉన్నాడు. 2010లో క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఆమిర్ కూడా ఉన్నాడు. సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్‌తో కలిసి మహ్మద్ ఆమిర్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతడిపై ఐదేళ్ల నిషేధం పడింది.

దీంతో 2010 నుంచి 2015 వరకు క్రికెట్‌కు దూరమైన ఆమిర్ ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పాక్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ ఆటకు గుడ్‌బై చెప్పిన రోజు వ్యవధిలోనే ఆమిర్ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఆమిర్ ఐర్లాండ్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. వాస్తవానికి 2020లోనే మేనేజ్‌మెంట్ తనను మానసికంగా వేధిస్తుందని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు మీడియాకు తెలిపాడు.